రామాయంపేట (విజయక్రాంతి): ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు నిలుస్తాయని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు. సోమవారం విజయక్రాంతి దినపత్రిక క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ ఆ చిరకాలంలోనే ప్రజాభిమానం చూరగొన్న పత్రిక విజయక్రాంతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట విజయక్రాంతి విలేకరి యాదగిరి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, వంజరి కటికే తదితరులు పాల్గొన్నారు.