గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ కాళోజి నారాయణరావు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజాకవి అని ఉద్యమ సమయంలో వారి కవితలు ప్రజల్లోకి వెళ్లాయని తద్వారా తెలంగాణ ఉద్యమం మరింత బలోపేతం అయిందని వారిని తెలంగాణ సమాజం మరువదు అని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు . అలాగే ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీ ఉద్దీన్, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.