మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు అభివృద్ధికి సహకరించవలసిన అవసరం ఉందని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో వార్డు విసిటింగ్ లో భాగంగా గీత హోటల్ నుండి ప్రేమ్ నగర్ చౌరస్తా వరకు లింక్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటంతో పరిసర ప్రతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ... చెత్త ఎక్కడపడితే అక్కడ వేసి మున్సిపాలిటీ వారు ఉన్నారు కదా..? వారు ఉన్నారు ఎందుకు..? అనేలా వ్యవహరించకూడదని బాధ్యతగా చిత్తకుండీలోనే చిత్తవేయాలని సూచించారు. పరిశుభ్రత అందరు అనుకుంటేనే సాధ్యమవుతుందని, ఎందుకు పుర ప్రజలు ప్రతి ఒక్కరు నుంచి సహకారం అందించాలని తెలిపారు.
డ్రైనేజీ రోడ్ల వాగు తదితర కార్యక్రమాలను అవసరాలని బట్టి వేగవంతంగా చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటూ పురపాలికలోని ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. చేస్తున్న ప్రతి పనిలోనూ పరిపక్వత పాటిస్తూ ప్రత్యేకంగా ముందుకు సాగడం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరుగా పరిశుభ్రత వైపు మారి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుంటూ మిగతా పురపాలికలకు ఆదర్శంగా తీసుకుపోదామని సూచించారు. వీలైనంత త్వరగా సిసి రోడ్లు, డ్రైనేజీలను మెరుగుపరిచేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో వార్డు సభ్యులు, కాలనీవాసులు ఉన్నారు.