calender_icon.png 26 October, 2024 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముని మాదిరి మ్యూట్..

05-07-2024 12:05:00 AM

నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ ఎలాంటి సినిమా అయి ఉంటుందా అని అంచనాలు వేసే పనిలో ఉన్నారు అభిమానులు. కృష్ణుడిలా ‘ప్రేమగాథ’లు వినిపించాలన్నా, ప్రేక్షకులంతా ‘భలే భలే’ అని నవ్వుకోవాలన్నా, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’గా కుటుంబాల్ని థియేటర్లకి రప్పించాలన్నా, యాక్షన్ ప్రియులకు ‘దసరా’ సంబరాలు ఇవ్వాలన్నా.. ‘సూస్కుందాం’ అంటూ సిద్ధంగా ఉంటారు నాని. అయితే వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏ కోవలో ఉంటుందో తెలియక వారంతా తికమక పడుతున్నారిప్పుడు. ఫస్ట్‌లుక్‌లో కోపోద్రిక్తుడైన నానిని కనబరిచిన మేకర్స్, తర్వాత విడుదల చేసిన దానిలో సాయికుమార్‌తో నవ్వులు చిందిస్తున్నట్టు చూపించారు.

తాజాగా ఈ సినిమా నుండి నాని పాత్రకి సంబంధించిన మరో పోస్టర్ విడుదలైం ది. సినిమాలో శనివారం మాత్రమే ఉగ్రరూపం దాల్చే నాని, మిగిలిన రోజుల్లో అందరిలానే మామూలుగా ఉంటాడంటూ దీని ద్వారా తెలిపిన దర్శక నిర్మాతలు, కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ‘గరం’ పాటలోని “ముని మాదిరి మ్యూట్.. ఆ స్లాట్‌లో నో ఫైట్‌” అన్న మాటలను జోడిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆదివారం నుండి శుక్రవారం వరకు మాసు క్లాసుల మధ్య ఊగిసలాడే ఇతగాడి కథేమిటన్నది తెలియాలంటే ఆగస్టు 29 వరకు ఆగాల్సిందే.