calender_icon.png 23 March, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో ‘ముంతాజ్’ ప్రాజెక్టు రద్దు

22-03-2025 12:51:36 AM

ఉత్తర్వులు వెలువరించిన ఏపీ ప్రభుత్వం

భక్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో నిర్ణయం

తిరుపతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తిరుమల కొండ మీద నిర్మించ తలపెట్టిన ముంతాజ్ హోటల్ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసింది. ‘తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూములను ప్రైవేటు పనులకు వాడబోం’ అని ఆయన తేల్చి చెప్పారు. ప్రాజెక్టును రద్దు చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం మీద విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ‘మీరు గత ప్రభుత్వాన్ని చూశారు. వారు ముంతాజ్ హోటల్ కట్టేందుకు అనుమతులు మంజూరు చేశారు. ఇలాంటి ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ముంతాజ్ నిర్వాహకులు పేరు మార్చుతామని హోటల్ నిర్మించేందుకు అనుమతి మంజూరు చేయమని కూడా అడిగారు. కానీ మేము వారికి అనుమతి ఇవ్వలేదు’ అని తెలిపారు.