- జహీరాబాద్ మీదుగా ప్రయాణం
- డీపీఆర్ సిద్ధం చేసిన రైల్ కార్పొరేషన్ లిమిటెడ్
- ముంబై-హైదరాబాద్ ప్రయాణం 3.50 గంటలే
సంగారెడ్డి, నవంబర్ 11 (విజయక్రాంతి): ముంబై-హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైల్వే ప్రాజెక్ట్ కోసం డీపీఆర్ (సమగ్ర ప్రణాళిక నివేదిక)ను సిద్ధం చేసి రైల్వే మంత్రిత్వశాఖకు సమర్పించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఈ ప్రాజెక్ట్‌ను 2051 వరకు పూర్తి చేసేందుకు ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఇంజినీరింగ్ అధికారులు పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించించారు. బుల్లెట్ రైలు మార్గంలో వాగులు, పెద్ద చెరువులు, రోడ్లు ఉండటంతో ఆ ప్రాంతంలో కల్వర్టులు, వంతెనలను నిర్మించేందుకు మట్టి పరీక్షలు చేసి, ప్రాథమికంగా ఎంత బడ్జెట్ అవసర మో అంచనా చేశారు.
రైల్వేమార్గంలో భూమి వివరాలు, ఈ ప్రాంతంలో ఉన్న జనాభా, ప్రజల అవసరాలు తదితర వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. బుల్లెట్ రైలు మార్గాన్ని ముంబై, పూనే, హైదరాబాద్ వయా జహీరాబాద్ మీదుగా 767 కిలోమీటర్ల పొడవైన హైణు రైలు మార్గాన్ని నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశా రు.
మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 11 స్టేషన్లతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నవీ ముంబై, లోనావాలా, పూనే, దౌండ్, అక్లూజ్, పండర్‌పూర్, షోలాపూర్, కలబురగి (గుల్బర్గా), జహీరాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో రైలు ఆగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. జాతీ య రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతాల వెంట ఈ నిర్మాణం చేప ట్టేందుకు ప్రాజెక్టును సిద్ధం చేశారు.
హై స్పీడ్ రైల్ కారిడార్‌లో కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు!
కేంద్రప్రభుత్వం 2019లో ముంబై వయా జహీరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2020లో ప్రాజెక్ట్ ప్రాథమిక టెండరింగ్ కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. భూకంపం సంభవించినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్ బ్రేకింగ్, అలారం సిస్ట మ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అంచనాలు తయారు చేస్తున్నారని సమాచారం.
పారిశ్రామికంగా జహీరాబాద్ అభివృద్ధి
జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుటికే ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా, పిరమిల్ ఫార్మా కంపెనీతో పాటు పలు పరిశ్రమలు నెలకొన్నాయి. సంగారెడ్డి జిల్లాలో మూడు చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీనికి తోడు జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి (నిమ్జ్) ఏర్పాటు చేయడంతో జహీరాబాద్ ప్రాంతానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించనుంది.
నిమ్జ్ ఏర్పాటు కోసం ప్రభు త్వం 12,500 ఎకరాల భూమిని సేకరిస్తోం ది. జహీరాబాద్ డివిజన్‌లోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలంలో నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పా టు చేస్తున్నారు. బర్దీపూర్, ఎల్గోయి గ్రామా ల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం పరిశ్రమల యాజమాన్యులకు భూము లు సైతం అప్పగించింది.
నిమ్జ్‌కు అనుసంధానంగా 65వ జాతీయ రహదారి, నిజాం పేట బీదర్ 161బీ జాతీయ రహదారులు ఉన్నాయి. కొత్తగా ప్రభుత్వం తాండూరు బీదర్ జాతీయ రహదారిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తాండురు నుంచి జహీరాబాద్‌కు ప్రత్యేక రైలు మార్గం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిమ్జ్‌కు సమీపం లో రైలు మార్గం ఇప్పుటికే ఉంది.
3.50 గంటలే ప్రయాణం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న జాతీయ పారి శ్రామిక ఉత్పత్తి మండలి (నిమ్జ్)కు అనుసంధనంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ముంబై 698 కిల్లోమీటర్ల దూరం ఉంది. 14 గంటలు ప్రయాణం చేయాల్సి ఉం టుంది. బుల్లెట్ రైలులో 3.50 గంటల్లో నే ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
బుల్లెట్ రైలు కోసం 767 కిల్లో మీటర్ల పట్టాలు నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. జహీరాబాద్ నిమ్జ్‌లో అంతర్జాతీయ సం స్థలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. బుల్లెట్ రైలుతో వ్యాపారులకు, ఉద్యోగులు ముంబై నుంచి హైదరాబా ద్, జహీరాబాద్‌కు తక్కువ సమయంలో చేరుకోవడానికి బుల్లెట్ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ముంబై- హైదరాబాద్ బుల్లెట్ రైలు డీపీఆర్‌లోని ముఖ్యాంశాలు
* రైలు గరిష్ఠ వేగం - 350 కిలోమీటర్లు
* ఆపరేషన్ స్పీడ్ - 320 కిలోమీటర్లు
* రైలు సగటు వేగం - 250 కిలోమీటర్లు
* ట్రాక్ గేజ్ స్టాండర్ట్ - 1435 మిల్లీమీటర్లు