calender_icon.png 21 January, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై పోలీస్ @ కరీంనగర్

12-07-2024 02:26:02 AM

కరీంనగర్ సిటీ, జూలై 11(విజయక్రాంతి): కరీంనగర్‌లో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్న బాధితులు సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంటే.. ఇప్పుడు అదే కరీంనగర్ సైబర్ క్రిమినల్స్‌కు అడ్డాగా మారిందనే వార్తలు కరీంనగర్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ముంబై నగరానికి చెందిన సైబర్ సెక్యూరిటీ వింగ్ పోలీసులు కరీనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గురువార మధ్యాహ్నం కరీంనగర్‌కు వచ్చిన ముంబై పోలీసుల బృందం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.