calender_icon.png 7 October, 2024 | 10:59 PM

ముంబైదే ఇరానీ

06-10-2024 12:00:00 AM

 15వ సారి ట్రోఫీ గెలిచిన ముంబై

27 1997-98 సీజన్ తర్వాత ముంబై (27ఏళ్లు) ఇరానీ కప్ సొంతం చేసుకోవడం విశేషం.

లక్నో: దేశవాలీ టోర్నీ ఇరానీ కప్ విజేతగా ముంబై నిలిచింది. ముంబై ఇరానీ కప్‌ను గెలవడం ఇది 15వ సారి. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసినా కానీ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కార ణంగా ముంబైని విజేతగా ప్రకటించారు. 153/6 ఓవర్‌నైట్ స్కోరు వద్ద ఐదో రోజుని ప్రారంభించిన ముంబై జట్టులో కొటియాన్ (114*), మోహిత్ (51*) నాటౌట్‌గా నిలిచి సత్తా చాటారు.

శార్దూల్ ఠాకూర్ (2) విఫలమైనా కానీ కొటియాన్ మోహిత్ ఇద్దరూ రెస్టాఫ్ ఇండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. కొటియాన్, మోహిత్ జోడీ తొమ్మి దో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అప్పటికే లీడ్ 450 పరుగులకు చేరుకోవడంతో మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేదని ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ముంబై జట్టు ఇరానీ ట్రోఫీ విజేతగా నిలిచింది.