పాత భవనం కూలి ఓ వృద్ధురాలి మృతి
ముంబై, జూలై 20: ముంబై మహానగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శుక్రవారం అత్యధికంగా ముంబై సెంట్రల్లో 78 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో జన జీవనం స్తంభించింది. వర్షాల ధాటికి వీధులు, ప్రధాన మార్గాల్లో భారీగా వరద చేరి ప్రజారవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. రైలు పట్టాలపై వరద చేరడంతో సబర్బన్ రైలు సర్వీసులు కొన్ని గంటల ఆలస్యంతో నడుస్తున్నాయి. గ్రాంట్ రోడ్డులోని పాత భవన సముదాయం కూలి ఓ వృద్ధురాలు తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందింది.