calender_icon.png 5 April, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై ఇండియన్స్ చేజేతులా

05-04-2025 01:36:31 AM

12 పరుగులతో లక్నో విజయం

లక్నో, ఏప్రిల్ 4: ఐపీఎల్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60), మార్కరమ్ (38 బంతుల్లో 53) రాణించారు.

ముంబై బౌలర్లలో  పాండ్యా 5 వికెట్లు తీశాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ (67), నమన్ ధిర్ (46) ఆకట్టుకున్నారు. నేడు డబుల్ హెడర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో చెన్నైతో ఢిల్లీ, రెండో మ్యాచ్‌లో పంజాబ్‌తో రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.