27-04-2025 07:37:11 PM
ముంబాయి: ఐపీఎల్ 2025 లో భాగంగా వాంఖాడే స్టేడియం(Wankhede Stadium) వేదికగా జరిగినా మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)పై ముంబాయి ఇండియన్స్(Mumbai Indians) 54 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 161 పరుగులకే కూలిపోయింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (34), నికోలస్ పూరన్(27), ఆయుశ్ బదోని(35), డేవిడ్ మిల్లర్ (24) పరుగులు చేశారు. ముంబాయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో అదరగొట్టగా, ట్రెంట్ బౌల్ట్ 3, విల్ జాక్స్ 2 వికెట్లతో మెరిపించారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసినా ముంబాయి నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కొల్పోయి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. ముంబాయి బ్యాటర్లలో ర్యాన్ రికెల్ టాన్ (58), సూర్యకుమార్ యాదవ్ (54) పరుగులు చేయగా.. చివర్లో నమన్ ధీర్ (25), కార్బిన్ బాష్ (20)పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు తీసుకోగా, ప్రిన్స్ యాదవ్, రవి బిష్నోయి, దిగ్వేష్ సింగ్ రతి చెరో వికెట్ సాధించారు.