calender_icon.png 11 October, 2024 | 10:55 AM

పటిష్ట స్థితిలో ముంబై

02-10-2024 12:00:00 AM

ఇరానీ కప్

లక్నో: ఇరానీ కప్‌లో భాగంగా తొలి రోజు ఆటముగిసే సమయానికి ముంబై జట్టు 237/4 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచిన రెస్టాఫ్ ఇండియా ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు పృథ్వీ షా (4), ఆయుష్ (19) విఫల మయ్యారు. వారికి తోడు వన్‌డౌన్‌లో హార్దిక్ డకౌట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రహనే (86*) మరోసారి తన క్లాస్ చూపెట్టాడు.

రహనేకు తోడుగా శ్రేయస్ అయ్యర్ (57) అర్ధ సెంచరీ చేయడంతో ముంబై కోలుకుతుంది. జట్టు స్కోరు 139 వద్ద అయ్యర్ ఔటైనా కానీ యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (54*) అర్ధ సెంచరీతో చెలరేగి ముంబైని పటిష్ట స్థితికి చేర్చాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్ 3, యశ్ దయాల్ ఒక వికెట్ తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియాకు రుతురాజ్ గైక్వాడ్ సారధిగా వ్యవహరిస్తున్నాడు.