06-03-2025 11:29:46 PM
నేను చిత్రహింసలకు గురవుతాను..
ముంబై దాడి సూత్రధారి తహవూర్ రాణా వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: ‘నన్ను భారత్‌కు అప్పగించొద్దు. అక్కడ నేను చిత్రహింసలు అనుభవించాల్సి వస్తుంది’ అంటూ 26/11 ముంబై దాడి సూత్రధారుడు తహవూర్ రాణా అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. భారత్‌కు తన అప్పగింతను నిలిపివేయాలని నిందితుడు యూఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టగా, నిందితుడు పై విధంగా భారత్‌పై నిందలు వేశాడు. నిందితుడిని భారత్‌కు రప్పించేందుకు ఇక్కడి ప్రభుత్వం ఎంతో కాలం నుంచి ప్రయత్నిస్తున్నది. నిందితుడిని అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సమ్మతించారు. మరోవైపు నిందితుడు తనను భారత్‌కు అప్పగించొద్దని గతంలోనే పలు న్యాయస్థానాలను ఆశ్రయించి భంగపడ్డాడు. శాన్‌ఫ్రాన్సిస్కో న్యాయస్థానానికి అప్పీల్‌కు వెళ్లినా చుక్కెదురైంది. దీంతో నిందితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలోనే నిందితుడు భారత్‌పై లేనిపోని నిందలు వేశాడు.