calender_icon.png 21 September, 2024 | 8:37 AM

ములుగు@ కంటెయినర్ స్కూల్

16-09-2024 01:02:05 PM

ములుగు: ప్రభుత్వాధికారులు తలుచుకుంటే ఏం చెయ్యొచ్చు ?.. సృజనాత్మకంగా చాలా చెయ్యొచ్చని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర నిరూపించారు.. హైద్రాబాద్ లో పలు దుకాణాలు, చిన్న షాపులను కంటెయినరలతో చేయడం చూసి ఉంటాము కానీ వినూత్నంగా తొలిసారి కంటెయినర్ స్కూల్ ను నిర్మింపజేయటం విశేషం..  ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బంగారు పల్లి గుత్తికోయగుంపు ఆటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ  శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అనుమతి్ంచదు. ఈ తండాలోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఓ గుడిసెలో విద్యాభ్యాసం కొనసాగిస్తూండగా.. ఈ క్రమంలో కలెక్టర్ దివాకర్ వినూత్నంగా ఆలోచించి కంటెయినర్(ప్రీ ఫ్యాబ్రికేటెడ్) పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వచ్చేవారం లో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో డ్యూయెల్ డెస్క్ లతో పాటు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవటానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉంటుంది.