విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత
శంషాబాద్ సమీపంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ హబ్‌పై సీఎం ప్రకటన
ఫార్మా భూముల్లో నిర్మించాలని ఆలోచన
ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన జపాన్ కంపెనీ
రంగారెడ్డి, జూలై 1౧ (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మహేశ్వరం నియోజకవర్గం లో విద్య, వైద్యం, పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవలె సీఎం రేవంత్‌రెడ్డి.. శంషా బాద్ సమీంలో వేయి ఎకరాల్లో హెల్త్ హబ్ నిర్మిస్తామని ప్రకటన కుడా చేశారు. దానిలో భాగంగానే సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు.. మల్టీ పర్పస్ కంపెనీలు, టౌన్‌షిప్‌ల ఏర్పా టు పై దృష్టి సారించారు.
అందుకు తగ్గట్టుగా అనువైన భూముల సేకరణపై వారు ఫోకస్ పెట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంతర్జాతీయ ఫార్మా సిటీ ఏర్పాటు కోసం మహేశ్వ రం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూములను సేకరించింది. మొదటి దశలో ఇబ్రహీంప ట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సం బంధించి గ్రామాల్లో 13 వేల ఎకరాల భూ ములకు సంబంధించి రైతులకు పరిహారం అందజేసి స్వాధీనం చేసుకుంది. అయితే అక్కడ ఫార్మా కంపెనీల ఏర్పాటుపై స్థానిక ప్రజలు, పర్యావణవేత్తలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత కుడా వచ్చింది.
ఫార్మాను రానివ్వమని కాంగ్రెస్ హామీ
గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు మద్దతుగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తాము అధికారంలో రాగానే ఫార్మాను రద్దు చేస్తామని కుడా ఆ పార్టీ హామీ మిచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం.. మొదట్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై భిన్న ప్రకటనలు చేసింది. ఈ క్రమంలో స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నంలో భాగంగా ఫార్మా కు సేకరించిన భూముల్లో మల్టీ పర్పస్ కంపెనీలు ఏర్పాటు చేయాలని సూత్రపాయంగా నిర్ణయించింది. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, భూముల పూర్తి వివరాలను తమకు అందజేయాలని సీఎం ఆదేశాల మేరకు.. మంత్రి శ్రీధర్‌బాబు ధరణి కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికు సూచనలు చేశారు. ఈ మేరకు కోదంరెడ్డి, కేఏల్‌ఆర్‌లు గత ప్రభుత్వం సేకరించిన ఫా ర్మా భూముల్లో పర్యటించి.. అక్కడి రైతుల అభిప్రాయాలను సేకరించి ఆ నివేదికను మంత్రి శ్రీధర్‌బాబుకు అందజేశారు.
ముందుకొచ్చిన జపాన్ కంపెనీ
ప్రభుత్వ ఆలోచన మేరకు ఔటర్ సమీపంలో ఫార్మాకు సేకరించిన భూమిలో మల్లీపర్పస్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు జపాన్ కంపెనీ ముందుకు వచ్చిం దని, రూ.40 వేల కోట్ల పెట్టుబడులతో తమ ప్రాజెక్టుకు సంబంధించి బ్లూప్రింట్‌ను కుడా సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని ఫార్మా భూముల్లో మల్టీ పర్పస్ టౌన్‌షిప్పులను ఏర్పాటు చేస్తే ప్రధానంగా రాష్ట్రంలోని రంగారెడ్డి, నల్లగొండ, మహబుబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగనుంది. ఫార్మా భూముల గుండా ఆయా జిల్లాలు సమీపంలో ఉండటం, రాకపోకలు ఇటుగానే ఉండటంతో ఆయా జిల్లాల్లో అభివృద్ధి మరింత శరవేగంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అభివృద్ధి కేంద్రంగా మారనుంది
మహేశ్వరం నియోజకవర్గం భవిష్యత్‌లో అభివృద్ధి కేంద్రంగా మారనుంది. సీఎం రేవంత్‌రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంపై ప్రత్యేక చొరవ చూపుతు న్నారు. నియోజకవర్గం హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పాటు అర్బ న్, సెమీ అర్బన్ ప్రాంతంగా విస్తరించి ఉండటం... ఈ ప్రాంతానికి అనుకూల అంశాలు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మం త్రి శ్రీధర్‌బాబు సూచనల మేరకు టీజీఐఐసీ పరిధిలో ఉన్న ఫార్మా భూముల వివరాలతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు, ప్రజల అభిప్రాయా లను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం.
కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం