calender_icon.png 28 September, 2024 | 2:58 AM

బఫర్ జోన్‌లో బహుళ అంతస్తులు

28-09-2024 12:42:18 AM

  1. రాముని చెరువు చుట్టూ గోడలు
  2. కరువైన అధికారుల పర్యవేక్షణ

మంచిర్యాల, సెప్టెంబర్ 2౭ (విజయక్రాం తి): ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా కొ ందరు రియల్టర్లు, బిల్డర్లు డబ్బులు సంపాద నే ధ్యేయంగా పని చేస్తున్నారనడానికి మంచిర్యా లలోని రాముని చెరువు బపర్‌జోన్‌లో నిర్మా ణాలే నిదర్శనం. ప్రభుత్వ పెద్దలను మేనేజ్ చే స్తూ చెరువులను మింగుతున్నారు.

జి ల్లా కేంద్ర ంలోని రాముని చెరువు పరిసర ప్రాంతం హా ట్ కేక్ లాంటిది. గతంలో ఈ చె రువు చుట్టూ పచ్చనిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. ప్రస్తుతం చెరువు బ ఫర్ జోన్, ఎఫ్‌టీఎ ల్, శిఖం భూముల్లో అక్రమార్కులు విచ్చలవి డిగా నిర్మాణాలు చేపడ తున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. 

47.32 ఎకరాల్లో రాముని చెరువు 

రాముని చెరువు సర్వే నంబర్ 406లో 47.32 ఎకరాల్లో విస్తరించి ఉండేది. దీని స్టో రేజి 15 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎఫ్‌టీ)లు కాగా అది కూడా తగ్గిపోయింది. చెరు వు ఎఫ్‌టీఎల్ హద్దులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. కానీ పదేండ్ల కి ందటి చెరువుకు ఇప్పటి చెరువు విస్తీర్ణానికి తీవ్ర వ్యత్యాసం ఉన్నది.

చెరువు చు ట్టూ బ ఫర్ జోన్‌లో గోడలు కట్టుకొని అక్ర మ ని ర్మాణాలు వెలిశాయి. వీటిపై అధికారు ల ప ర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు య థేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. చెరువు బ ఫర్‌జోన్‌లో కొందరు బిల్డర్లు దర్జాగా బహు ళ అంతస్తుల భవన నిర్మాణ పనులు చేపడు తున్నారు. జీ+5, అంతకుమించి నిర్మాణాలు జరుపుతున్నారు.

కొందరైతే ఒక సర్వే నంబర్‌తో భవన నిర్మాణాలకు అనుమతి తీ సుకొని మరో చోట నిర్మాణాలు జరుపుతున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, శిఖం భూమి పట్టా ఉన్న సర్వే నంబ ర్లు కాకుండా ఇతర సర్వే నంబర్ మీద అనుమతి తీసుకొని చెరువు బఫర్ జోన్‌లోనే నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఊర చెరువు సర్వే షురూ

మంచిర్యాల, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మే రకు మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ఊ ర చెరువు భూముల సర్వేను శు క్రవారం రె వెన్యూ, ఇరిగేషన్ అధికారు లు నిర్వహించా రు.

రెవెన్యూ అధికారు లు హద్దు రాళ్లను గు ర్తించడంలో ఇబ్బందులు పడటంతో సర్వేను వాయిదా వే శారు. సర్వే నంబర్ల ప్రకారం హద్దులను గుర్తిస్తేనే  ఖచ్చితమైన హద్దులకు అవకాశం ఉంటుందని నిలిపివేశారు. ఈ స ర్వేలో ఇరిగేషన్ డీఈ శారద, ఏఈ రమ్య, రె వెన్యూ ఆర్‌ఐ గణపతి రాథోడ్ పాల్గొన్నారు.