మంత్రి కొండా సురేఖ
సిద్దిపేట, సెప్టెంబరు 27 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ త్వరలో అందించనున్న హెల్త్ ప్రొఫైల్‌తో బహుళ ప్రయోజనాలు ఉంటాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో.. చేర్యాల, మద్దూరు, దూల్‌మిట్ట, కొమురవెళ్లి మండలాలకు చెంది న కల్యాణ లక్ష్మి, షాదీముబారాక్ చెక్కులను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ ర్‌రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయ ని చెప్పారు. అయితే చేర్యా లలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సమ యంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు పట్టి నిరసన తెలిపారు. కల్యణ లక్ష్మిచెక్కు లు సరే తులం బంగారం ఏమైంది అంటూ మంత్రి ఎదుట నినాదాలు చేశారు.
ఈ సంద ర్భంగా అక్కడ కొంత వాగ్వాదం జరిగినప్ప టికీ పోలీసులు పరిస్థితి ని అదుపు చేశారు. అనంతరం జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షు డు, నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మురి ప్రతా ప్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రి ఆయనతో కలిసి కార్యకర్తలతో సమావేశ మయ్యారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేయాలని కార్యకర్తలను కోరారు.