calender_icon.png 13 January, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహన రాకపోకలను పరిశీలించిన మల్టీ జోన్-2 ఐజి సత్యనారాయణ

12-01-2025 07:50:12 PM

కోదాడ (విజయక్రాంతి): హైదరాబాదు నుండి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే వాహనదారులు పోలీసులకు సహకరించాలని మల్టీ జోన్-2 ఐజి సత్యనారాయణ సూచించారు. జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సొంత గ్రామానికి వెళుతున్న వాహనాలతో రద్దీగా మారింది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు పోలీసులు పూర్తిస్థాయిలో ప్రొటెక్షన్ ఇస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ లో క్లియర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కోదాడ పట్టణంలోని కొమరబండ జంక్షన్, రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద ఐజి వాహన రాకపోకలలో తనిఖీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజాల వాహనాల రద్దీ భారీగా కొనసాగుతున్నది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. పంతంగి టోల్ ప్లాజాలో వాహనాల రద్దీ దృశ్య 10 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచినట్లుగా ఆయన పేర్కొన్నారు. మామూలు రోజులలో 35,000 నుండి 45000 వాహనాలు వెళ్తాయని సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే యాభై ఐదు వేల వాహనాలు వెళ్లినట్లు తెలిపారు. కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి, మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్, చింతపాలెం ఎస్సై అంతిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.