పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
భీమదేవరపల్లి, నవంబరు 23: దేశంలో ప్రఖ్యాతిగాంచిన ముల్కనూర్ సహకార బ్యాంకు పనితీరు భేష్ అని, రైతు శ్రేయస్సే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ముల్కనూరు సహకార బ్యాంకు పనితీరును పరకాలలోని వివిధ గ్రామాలకు చెందిన సహకార సంఘాల ప్రతినిధులతో కలిసి శనివారం ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సందర్శించారు.
రైతుల సమిష్టి కృషితో పాటు పాలకమండలి అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి వల్లనే ఖండాంతరాలకు బ్యాంకు కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుతుందన్నారు. రైతుల పంటలు పండించేందుకు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా ముల్కనూర్ సహకార బ్యాంకు అండగా ఉంటోందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కాటన్ జిన్నింగ్ మిల్లు, ముల్కనూర్ డెయిరీ నిర్వహణను పరిశీలించారు. ఆయనవెంట డెయిరీ అధ్యక్షుడు బుర్ర ధనశ్రీ, డెయిరీ జీఎం మార్పాటి భాస్కర్‌రెడ్డి, లోన్స్ మేనేజర్ రాజమౌళి ఉన్నారు.