calender_icon.png 8 January, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్బరీ రైతులకు సకాలంలో రాయితీలివ్వాలి

08-01-2025 01:39:10 AM

* రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): మల్బరీ రైతులకు యంత్రాంగం సకాలంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని  రాష్ట్ర వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ప్రగతిపై ఆ శాఖ ఉన్నతాధికారులు రఘనందన్‌రావు, గోపి, ఉద్యాన శాఖ సంచాలకుడు యాస్మిన్ భాషా, మార్కెటింగ్ కో సంచాలకులు ఉదయ్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావే శంలో మంత్రి మాట్లాడారు.

రాష్ట్రంలో పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. మల్బరీ రైతులకు మార్కెటింగ్ వసతులను వృద్ధి చేయాలని నిర్దేశించారు. ఇక నుంచి మూడు నెలలకోసారి ప్రతి పథకంపై సమీక్ష నిర్వహిస్తానని, అలసత్వం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులను పెండింగ్‌లో పెట్టొద్దని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలను పెండింగ్ లో పెట్టడం సరికాదన్నారు. మూడురోజుల్లో అన్ని విజప్తులను పరిశీలించి, నివేదిక పంపించాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. 

వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, సూక్ష్మ సేద్య నీటి పరికరాలను సబ్సిడీపై ఎక్కువ మంది రైతులకు అందే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆ విభాగ అధికారులకు సూచించారు. భూ నమూనా పరీక్ష ఫలితాలను సాగుకు ముందే అందజేయడం వ్యవసాయశాఖ బాధ్యత అని గుర్తుచేశారు.