calender_icon.png 21 April, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందానగర్‌లో ముకుంద జ్యువెల్లర్స్

20-04-2025 12:00:00 AM

ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ

హైదరాబాద్, ఏప్రిల్ 19 (హైదరాబాద్): చందానగర్‌లో ముకుంద జ్యువెల్లర్స్ ఫ్యాక్టరీ ఔట్‌లెట్ నూతన బ్రాంచీని శనివారం ప్రారంభించారు. శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని కేఎల్‌ఎమ్ మాల్ పక్కన ఉన్న మ్యాగ్‌డ్రీమ్స్ భవనంలోని నాలుగవ అంతస్తులో ముకుంద జ్యువెల్లరీని ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, కార్పొరేటర్ మంజూలరఘునాథ్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేపీహెచ్ బీ, ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, హనుమకొండ, సుచిత్ర నందు తమ బ్రాంచిలను ప్రారంభించామన్నారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో చందానగర్‌లో నూతన బ్రాంచ్‌ను ప్రారంభించా మని సంస్థ ఎండీ నరసింహరెడ్డి తెలిపారు. తమను ఆదరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు.