హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): సోమాజిగూడలోని గ్రీన్‌లాండ్ రోడ్డులో గురువారం ముకుంద జ్యూవెలర్స్ నూతన బ్రాంచ్ ప్రారంభమైంది. స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్‌యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో సోమాజిగూడలో మరో బ్రాంచ్‌ను ప్రారంభించామని తెలిపారు. తమను ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో మరిన్ని బ్రాంచ్‌లను ప్రారంభిస్తామన్నారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఆషాఢం బంపర్ సేల్‌లో భాగంగా వీఏపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు చెప్పారు. కేపీహెచ్‌బీ, ఖమ్మం, కొత్తపేట నందు కొత్త బ్రాంచిలను ప్రారంభించామని చెప్పారు.