హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): సురేంద్రపురి వెంకటేశ్వర దేవాలయంలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ కుందా ప్రతిభ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు నిజాభిషేకం, అర్చన, ఉదయం 6 గంటలకు ఉత్తర (వైకుంఠ) ద్వారా దర్శనం హారతి, ఊరేగింపు జరుగుతుందన్నారు. భక్తులు స్వామి వారిని ఉత్తర (వైకుంఠ) ద్వారం ద్వారా దర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకోవాలని కోరారు.