హరి హరులను ఉత్తరద్వారం నుంచి దర్శించుకున్న భక్తులు
ఏర్పాట్లు చేసిన ఆలయాధికారులు
సిరిసిల్ల (విజయక్రాంతి): దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకదాశి వేడుకులు శక్రవారం అత్యంత వైభోపేతంగా జరిగాయి. ఆలయాధికారులు ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంగు రంగు పూలతో ఆలయాన్ని అలంకరించారు. కోటి లింగాల వద్ద ప్రత్యేక ప్రాకారం ఏర్పాటు చేశారు. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామునే భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనానికి తరలివచ్చారు. అంబారి సేవలపై స్వామివారిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముక్కోటి ఏకదాశి విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. ఈ వేడుకల్లో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, విజయక్రాంతి సీఎండీ విజయరాజంలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో నాయకులు ప్రతాప రామకృష్ణ, ఏనుగు మనోహర్‌రెడ్డి, చందుర్తి మాజీ జడ్పీటీసీ నాగంకుమార్, ఆలయ ఈవో వినోద్‌రెడ్డిలు పాల్గొన్నారు.