calender_icon.png 25 February, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కంటి క్షేత్రం.. శివరాత్రికి ముస్తాబు

25-02-2025 02:15:39 AM

  • వేములవాడ రాజన్న సన్నిధిలో నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు
  • సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
  • వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం
  • రంగురంగుల దీపాలతో స్వాగత తోరణాలు 

వేములవాడ, ఫిబ్రవరి 24: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో యేటా మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఈ యేడు మంగళ, బుధ, గురువారాల్లో  వేడుకలు జరుగనుండగా రాష్ర్టం నలుమూలల నుంచి సుమారు 4లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని.

ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. నీడ కోసం చలువ పందిళ్లు వేశామన్నారు. క్యూలై న్లోని భక్తులకు తాగునీరు అందించనున్నామని వెల్లడించారు. ధర్మగుండాన్ని శుభ్రం చేసి మంచినీటితో నింపినట్లు చెప్పారు. తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించామన్నారు. 4వేలలీటర్ల సామర్థ్యం కలిగిన వాటరు ట్యాంకును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

భక్తుల ఇబ్బందులు తెలుసుకునేం దుకు వెర్లైస్ వాకీటాకీలతో అనుసంధానం చేయనున్నట్లు, హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశామని, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వాహనాల పార్కిం గ్ కోసం స్థలాలను సిద్ధం చేశామని, కూడళ్లలో హైమాస్ట్ లైట్లను అమర్చి నట్లు వెల్లడించారు. శివరాత్రి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు వెల్లడించారు.

పట్టువస్త్రాలు రాష్ర్ట ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువా రం రాత్రి 7 గంటలకు, 7.30 గంటలకు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.

మహా శివరాత్రి జాతర సందర్భం గా 1,500మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎన్సీ అఖిలమహాజన్ పేర్కొన్నారు. ఎన్నో వ్యవప్రయా సాలకు ఓర్చి సుదూర ప్రాంతాలనుంచి స్వామివారిని దర్శనానికి వచ్చే భక్తు క ఓపికతో సలహాలు, సూచనలు ఇవ్వాల న్నారు. విధులు నిర్వహించేందుకు హాజరైన పోలీస్ అధికారులు, సిబ్బందితో సోమవారం మహాలింగేశ్వర గార్డెన్లో సమావేశం నిర్వ హించారు.

భక్తులకు అసౌకర్యం కలుగకుండా అందరూ సమన్వయంతో పనిచే యాలని సూచించారు. ఇబ్బందులు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూంకు తెలియజేయాలన్నారు. అనుబంధ ఆలయాల్లోనూ నిరంత రం భద్ర త ఉంటుందన్నారు.

అనంతరం  మహా శివరాత్రి జాతర సందర్భంగా పూర్తి చేసిన ఏర్పాట్లను ఎస్సీ అఖిల్ మహాజన్  సోమవారం  పరిశీ లించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పోలీస్ బందోబస్తు, వైద్య ఆరోగ్యశాఖ సహకా మెడికల్ క్యాంప్ నిర్వహించాలన్నారు.