10-04-2025 12:00:00 AM
గంజాయి సేవిస్తూ ఆశ్లీల నృత్యాలు?
ఆరుగురు యువతులు సహా 20 మంది అరెస్టు
70 గ్రాముల గంజాయి, 15 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం
చేవెళ్ల, ఏప్రిల్ 9: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎత్బార్‌పల్లిలోని హాలిడే హోం ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ నిర్వహించడం సంచలనంగా మారింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఆరుగురు యువతులు సహా 20 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ లుక్మాన్ తన పుట్టిన రోజు వేడుకల కోసం ఎత్బార్‌పల్లిలోని హాలిడే హోం ఫామ్ హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడు. నగరానికే చెందిన పీ బాబు, రీనా ద్వారా అరుగురు యువతులను బుక్ చేసుకున్నాడు. మంగళవారం రాత్రి తన 12 మంది మిత్రులతో అక్కడి చేరుకొని మద్యం తాగుతూ యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాం తంలో సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు అక్కడికి చేరుకొని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మొయినాబాద్ పోలీసు లకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి వెళ్లి యువతీ, యువకులను అరెస్ట్ చేశారు. పార్టీలో 70 గ్రాముల గంజాయితోపాటు మద్యం సీసాలు, 15 కండోమ్ ప్యాకె ట్లు, ఓసీడీ హుక్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 25 మొబైల్ ఫోన్లు, 6 వాహనాలను సీజ్ చేశారు. మొత్తం 13 యువకు లు, ఆరుగురు యువకులపై కేసు నమోదు చేసినట్టు మొయినాబాద్ సీఐ పవన్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. పట్టుబడ్డ యువతుల్లో ఐదురు గరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. వీరిని బుక్ చేసిన పీ గోపి, రీనాలతో పాటు ఫామ్‌హౌస్ ఓనర్ అబ్దుల్ బిన్ పైనా కేసు నమోదు చేశామని వెల్లడించారు.