పెద్దపల్లి: రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా పీరిల పండుగ ఉత్సవాలు జరిగాయి. హిందూ-ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలిచే మొహరం పండుగ ఉత్సవాలు రత్నాపూర్‌లో నిర్వహించారు. డప్పులతో పీరిలను పట్టుకొని ఊరిలో ఊరేగించడంతో భక్తులు పీరిలకు పూలమాలలు వేసి పూజించారు. ఈ వేడుకలలో మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు పాల్గొన్నారు. నిర్వాహకులు కెక్కర్ల రాములు, ధర్ముల సంజీవ్ కుమార్, లింగాల వినోద్, ధర్ముల వీరయ్య, ఉడుత మల్లయ్య,కండే గట్టయ్య, బండి సాయికుమార్, మన్నాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.