calender_icon.png 14 January, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా ముగ్గుల, ఆటల పోటీలు

13-01-2025 10:47:10 PM

మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు..

బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక తాళ్లగొమ్మూరు గ్రామపంచాయతీలో మాజీ సర్పంచ్ కోయల పుల్లారావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు, ఖోఖో, కబడ్డీ పోటీలను నిర్వహించారు. బహుమతుల దాతగా గుమ్మడి కృష్ణవేణి, వడ్డాణపు తిరుపతమ్మలు బహుకరించగా ముఖ్య అతిథులుగా అఖిలపక్ష నాయకులు తాతా మాధవి లత, బెల్లంకొండ రామారావు బెల్లంకొండ వాసుదేవరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ... భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలలో భాగంగా భోగి పండుగ రోజున పంచాయతీలో నివసించే గ్రామస్తులందరూ కుల, మత చిన్న,పెద్ద తారతమ్యం లేకుండా ఒకే చోట కలిసి ఆటల పోటీలలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ఉండే మహిళలంతా కలిసి ఒకే చోటకు చేరుకొని రంగవల్లులు దిద్దుతూ పండగ వాతావరణం తీసుకురావడం శుభ సంతోషకరమని అన్నారు.

మాజీ సర్పంచ్ కోయల పుల్లారావు ప్రతి ఒక్కరికి సుపరిచితుడని, గతంలో తనకున్న పదవీ బాధ్యతలు క్రమంగా నిర్వహించాడని తెలిపారు. బహుమతుల సేకరణ చేసి ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహిస్తూ ఆహ్లాదకరమైన పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన పుల్లారావు వ్యక్తిత్వం గొప్పదని కొనియాడారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా బెల్లంకొండ రామారావు తాతా మాధవి లత సహకరించడం జరిగింది. కోచ్ గా గిరి, జాన్సన్ నిర్వర్తించగా చిన్న,పెద్ద తారతమ్యం లేకుండా ఆహ్లాదకరంగా జరిగిన ముగ్గుల పోటీల్లో మొదటి విజేతగా కె జోష్ణ, ద్వితీయ బహుమతి విజేతగా నీలిమా రెడ్డి, అక్షర కాగా మూడో బహుమతి విజేతలుగా కావ్యశ్రీ, శ్రీసాయి ప్రియగా నిలిచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన తాత మాధవి లత, బెల్లంకొండ వాసుదేవరావు, ప్రసాద్ రావు తదితరులు మాట్లాడుతూ.. గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను విడిచి పెట్టకుండా మకర సంక్రాంతి యొక్క ప్రతిష్టను తెలుపుతూ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించాలని తేజావత్ రాము, అరుణ యొక్క ఆలోచన గొప్పదని కొనియాడారు.

న్యాయ నిర్ణీతలుగా తాత మాధవి లత, బెల్లంకొండ రామారావు వ్యవహరించడం జరిగింది. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతిగా నీలిమ రెండవ బహుమతిగా జోష్ణ మూడవ బహుమతిగా కావ్య శ్రీ, రమణ గెలుపొందారు. కుర్చీల ఆటలో కొంతల జోష్ణ, బొడ్డు మైత్రి గెలుపొందగా కబడ్డీ ఆటల్లో పిడుగు బద్రి టీం, జూనియర్ కబడ్డీ ఆటలో జె శ్రీనివాస్ టీమ్ గెలుపొందారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ ప్రసాద్ రావు, బెల్లంకొండ వాసుదేవరావు, నారాయణ రెడ్డి, అప్పారావు, వీరభద్ర రావు, ముత్యాల శ్రీనివాస్, కొమరయ్య, అర్జున్ రావు, అనిల్, వడ్లమూడి కుమారి, వెంకట్రావు, బూరం ప్రసాద్, జానీ ఉమామహేశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.