మందమర్రి (విజయక్రాంతి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ సేవ సంస్థ ఆధ్వర్యంలో రంగవల్లి పోటీలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హై స్కూల్ మైదానంలో అంబేద్కర్ కాలనీ ఎస్ వి టెంపుల్ ఏరియా వాసులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అంబేద్కర్ సేవా సంస్థ నిర్వాహకులు దాసరి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లికల పోటీలకు ముఖ్య అతిథిగా పట్టణ ఎస్సై రాజశేఖర్ సతీమణి హరిక ప్రియ హాజరై రంగవల్లికలను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు ఎస్సై దంపతులు బహుమతులు అందజేశారు. కాగా ప్రథమ బహుమతి దాసరి జ్యోతి, ద్వితీయ బహుమతి యాదగిరి శ్రీజ, తృతీయ బహుమతి ముల్కల గీతలు గెలుచుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆది జాంబవ సంఘం నాయకులు కంబాల రాజనర్సు, ఉప్పులేటి నరేష్, దాసరి రాజనర్సు, అంబేద్కర్ ఏరియా మహిళలు లావణ్య, కనుకుంట్ల వెంకటలక్ష్మి, పుల్లకోల శారద, దాసరి రాజేశ్వరి, దాసరి రోజా రాణిలు పాల్గొన్నారు.