శ్రీరంగపూర్, జనవరి 11: అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతికి ప్రతీకలు ముగ్గులు అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. శనివారం శ్రీరంగాపురం మండల కేంద్రంలో సాహితీకళావేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముత్యాల ముగ్గుల పోటీని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు నలభై మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ వేల సంవత్సరాల కిందటి నుండే ముగ్గులు వేసే సంప్రదాయం మన దేశంలో ఉందని ఆయన అన్నారు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో తమ ఇళ్లను పేడతో అలికి రంగవల్లులతో అలంకరిం చుకునే ఆనవాయితీని మనం చూడవ చ్చని తెలిపారు.
పల్లెల్లోని మహిళలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇక్కడ జిల్లా స్థాయి ముగ్గుల పోటీని ఏర్పాటు చేసినట్లు శంకర్ గౌడ్ వివరిం చారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన శివమ్మ (ప్రథమ), సునీత(ద్వితీయ), ఉషారాణి (తృతీయ)లకు వరుసగా ౫వేలు, ౩వేలు, ౨వేల రూపాయల నగదు బహుమతు లను అందజేశారు.
పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు. కళావేదిక ప్రతినిధులు జనజ్వాల, బైరోజు చంద్ర శేఖర్, జయంత్ రెడ్డి, రాజకీయ నాయకులు రాజేంద్ర ప్రసాద్, కురుమయ్య, బీరం రాజశేఖర్ రెడ్డి, వెంకటయ్య, రాముడు, పర్వతాలు, రాజగౌడ్, రవీందర్ గౌడ్, రవి కుమార్, శ్రీ లక్ష్మీ, కవిత, జ్యోతి, శ్రావణి అనిల్ కుమార్ పాల్గొన్నారు.