ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జనవరి 19 : మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ముగ్గులు అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పద్మశాలీ సంఘం ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు అతినగరం సుదేష్ ఆధ్వర్యలో ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నగర నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్‌రావు, నాయకులు ముఠా జైసింహ, కార్పొరేటర్ సుప్రియా నవీన్‌గౌడ్, సంఘం మహిళా కమిటీ అధ్యక్షురాలు బోనం ఊర్మిళ, నాయకులు మంతన దశరథ్, తిరుపతి, నిర్మల, అరుణ, సతీష్, ఎయిర్‌టెల్ రాజు తదితరులు పాల్గొన్నారు.