calender_icon.png 26 October, 2024 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముద్ర రుణ పరిమితి రెట్టింపు

26-10-2024 12:49:15 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: పీఎం ముద్ర యోజన రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు రుణాలను అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. రుణ పరిమితిని పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ఇదివరకే నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకంలో వినియోగదారులకు ౩ రకాలుగా రుణాలు అందిస్తారు. శిశు రుణాల కింద రూ.50 వేల వరకు, కిశోర.. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్ రుణాల కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ ఇస్తారు. తాజాగా తరుణ్ ప్లస్ పేరుతో కొత్త క్యాటగిరీని జోడించారు. దీని పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలుగా నిర్ణయించారు.