05-03-2025 11:01:04 PM
బీసీ డీ నుంచి బీసీ ఏ లో చేర్చాలి..
మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, నీలం మధు..
శంషాబాద్‌లో ముదిరాజ్‌ల కృతజ్ఞత సభ..
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ముదిరాజ్‌లకు వెంటనే మంత్రివర్గంలో చోటు కల్పించాలని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల జరిపిన కుల గణనలో ముదిరాజ్‌లు అత్యధిక సంఖ్యలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ముదిరాజ్‌ల కృతజ్ఞత సభ నిర్వహించారు. రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయనతో పాటు నీలం మధు ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ముదిరాజ్‌లకు వెంటనే మంత్రివర్గంలో చోటు కల్పించాలని అవసరం ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన రెండు మంత్రి పదవులతో పాటు రెండు ఎమ్మెల్సీలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ముదిరాజ్ కార్పొరేషన్‌కు అత్యధిక నిధులు కేటాయించాలని కోరారు. ముదిరాజ్‌లను బీసీ డి నుంచి ఏ లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.