calender_icon.png 29 November, 2024 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల సంపూర్ణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

28-11-2024 10:54:42 PM

పటాన్ చెరు,(విజయక్రాంతి): మత్స్యకారుల సంపూర్ణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే  సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో నిర్మించిన ముదిరాజ్,  మత్స్య సహకార సంఘం భవన ప్రారంభోత్సవానికి నీలం మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సత్యనారాయణ వ్రతం, కార్తీక మాస వన భోజనాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.

మత్స్యకారుల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేపల పెంపకానికి ఉచితంగా చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిందని, మత్స్యకారుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  కార్తీక మాసం సందర్భంగా శివ కేశవులను పూజిస్తూ ఏర్పాటు చేసిన వన భోజనాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వన బోజనాలు ఐక్యతను సూచించడంతో పాటు మనషుల మధ్య స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. మనం ఐకమత్యంగా ముందుకు నడిస్తేనే సమాజంలో మన జాతికి గుర్తింపు లభిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పులిమామిడి రాజు, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేష్, మాజీ సర్పంచులు ఆంజనేయులు,  జింకల శివరాజ్, వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎట్టయ్య, మండల నాయకులు నారబోయిన శ్రీనివాస్, గ్యారాల మల్లేష్, మాణిక్యరావ్, లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్, అశోక్, గణేష్, వీరేష్, పూజరి రాజు, సాయి, శ్రీశైలం, రఘు, మహిళలు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.