మంథని(విజయక్రాంతి): మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డిని బోయినపేట ముదిరాజ్ సంఘం నాయకులు శుక్రవారం ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. మంథని మున్సిపల్ పరిధి బోయిన్ పేటలో ముదిరాజ్ సంఘం నాయకులు ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డిని, మంథని మున్సిపల్ పాలకవర్గం సభ్యులను వారు ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు పలు సమస్యల పైన ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఆమె సానుకూలంగా స్పందిస్తూ, ముదిరాజు సంఘం నాయకుల సమస్యలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్తానని, సమస్యలు పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ముదిరాజ్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు గుండా విజయలక్ష్మి పాపారావు,నక్క నాగేంద్ర శంకర్,వేముల లక్ష్మి సమ్మయ్య, కయితీ సమ్మయ్య. అధ్యక్షులు సబ్బని సమ్మయ్య, పోలు కనక రాజు, నాయకులు పోలు శివ, గుండా రాజు, కిరణ్ పోతార వేణి క్రాంతి కుమార్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్, ముదిరాజు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.