న్యూఢిల్లీ, జూలై 21 : బోర్డుల బురద ఉజ్జయినికీ పాకింది. కన్వర్ తరహాలోనే ఉజ్జయినిలోనూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇదే రకమైన ఆదేశాలిచ్చింది. హోటళ్లు, తోపుడు బండ్లపై తమ పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. క్యూఆర్‌కోడ్, ఫోన్ నంబర్‌ను కూడా జతచేయాలని పేర్కొం ది. ఉల్లంఘి ంచినవారికి రూ.౫౦౦౦ వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.
అందులో తప్పేముంది: బాబా రాందేవ్
కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాలు, ఆహార దుకాణాల యజమానులు తమ పేర్లను నేమ్‌ప్లేట్లపై ప్ర దర్శించాలని యూపీ ప్రభుత్వం చేసిన ఆదేశాలను బాబా రాందేవ్ సమర్థించారు. పేర్లు ప్రదర్శించడంలో అభ్యంత రం ఏంటి? అని ప్రశ్నించారు. చేసే పని లో స్వచ్ఛత ఉంటే ఎవరైనా పట్టింపు లేదన్నారు.