31-03-2025 04:29:05 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో సోమవారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య 64వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, టీపీసీసీ సభ్యులు చిలుముల శంకర్, జిల్లా జనరల్ సెక్రెటరీ చిలువేరు సత్యనారాయణ, సీనియర్ నాయకులు గెల్లి రాయలింగు, మాజీ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్, డీకొండ రాయలింగు, మాజీ పట్టణ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.