28-04-2025 02:02:28 AM
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 27: పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా పదవులు చేపట్టి అటు ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలందించడంతో పాటు ఇటు పార్టీ ప్రతినిధిగా కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన గొప్ప నేత యం సత్యనారాయణ రావు అని మానకొండూరు ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు స్వర్గీయ యం.సత్యనారాయణ 4వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఏఐసీసీ సెక్రెటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎంపీ పి.విశ్వనాథన్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పిసిసి అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు, నాయకులు యం.ఎస్.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం కోసం తన పదవిని సైతం త్యాగం చేసారని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా డిల్లీలోని అగ్రనేతలతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిగా రాష్ర్ట ఏర్పాటు ప్రాముఖ్యతను ఎమ్మెస్సార్ తెలియజేశారని అన్నారు. మంత్రిగా ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి చెరగని ముద్ర వేశారని, బలహీన వర్గాలకు చెందిన ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు పనిచేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రుద్ర సంతోష్, పవన్ మల్లాది, వైద్యుల అంజన్ కుమార్, ఆరేపల్లి మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఊట్కూరి నరేందర్ రెడ్డి ఎం.డి తాజ్, పులి అంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, అనిల్ కుమార్, గడ్డం విలాస్ రెడ్డి, వెన్న రాజ మల్లయ్య, మల్యాల సుజిత్ కుమార్, సిరాజు హుస్సేన్, అహమ్మద్ అలీ, బొబ్బిలి విక్టర్, ములకల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.