calender_icon.png 19 April, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నచ్చిన ఉద్యోగం కాదు వచ్చిన ఉద్యోగం చేయండి

12-04-2025 04:37:42 PM

పీయూ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డా మధుసూదన్ రెడ్డి..

పాలమూరు యూనివర్సిటీ (విజయక్రాంతి): నచ్చిన ఉద్యోగం కాదు వచ్చిన ఉద్యోగం చేయాలని పాలమూరు యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం సెమినార్ హల్ యందు ఎమ్‌ఎస్‌ఎన్ లేబరటరీ వారు క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించారు. హెచ్‌ఆర్ శ్రీ సుబ్బారావు, క్యూసీ మేనేజర్లు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌.ఎన్. అర్జున్ కుమార్ తో కలిసి సెమినార్ హాల్‌లో క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభించారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌.ఎన్. అర్జున్ కుమార్  మాట్లాడుతూ..  60 మందికి పైగా విద్యార్థులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారని, మొదటి దశగా రాత పరీక్ష ఉంటుందని, రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తరువాత ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని, తుది లిస్ట్ ను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలను చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.