calender_icon.png 20 September, 2024 | 9:26 AM

కేసీఆర్ పాలనలో పరుగులు పెట్టిన ఎంఎస్‌ఎంఈలు

19-09-2024 01:09:37 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పరిపాలనలో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం అభివృద్ధిలో పరుగులు పెట్టిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్  కే తారక రామారావు బుధవా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది తాను చెప్తుతున్న విషయం కాదని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా లెక్కలతో సహా వివరించిం దన్నారు. కేసీఆర్‌పై బురద చల్లాలని ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా లెక్కలు మాత్రం అబద్ధాలు చెప్పవన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదన్నారు. పదేం డ్లలో వృద్ధి రేటు 11 నుంచి 15 శాతం మధ్య ఉందని ప్రభుత్వమే ఒప్పుకొందన్నారు.

2018--2023 మధ్యలో టీఎస్ ఐపాస్ ద్వారా సగటు పెట్టుబడులు 115 శాతం పెరిగినట్లు చెప్పారు. జీఎస్‌డీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా ఏటా 10 శాతం వృద్ధి చెందగా, ఎంఎస్‌ఎంఈల వృద్ధిలో 15 పెంపు నమో దైందన్నారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా ఉపాధి కల్పనలోనూ 20 శాతం పెరుగుదల కనిపించిందని, ఇది ఎస్సీ, ఎస్టీ మహిళల్లో 30 శాతంగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్ లాంటి ప్రగతి శీల విధానాలు, చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతో ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందన్నారు.