calender_icon.png 20 September, 2024 | 2:26 PM

దేశానికే దిక్సూచిగా ఎంఎస్‌ఎంఈ పాలసీ

19-09-2024 03:16:00 AM

సుస్థిర ఎగుమతిదారుగా తెలంగాణ

యువతకు నాణ్యమైన ఉపాధికి దోహదం

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి): రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషిస్తా యని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఆ దిశగా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహక చర్యలను చేపట్టింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా, ఈ విషయంలో దేశానికే దిక్సూచిగా నిలిచేలా ఎంఎస్‌ఎంఈ పాలసీని రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ పాలసీ దేశం లోనే అత్యుత్తమంగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉండే విప్లవాత్మక పాలసీగా నిలుస్తుంది. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ పాలసీ ద్వారా ఎండ్ టూ ఎండ్ సపోర్ట్ అందించడంతోపాటు ఎస్‌హెచ్‌జీలను ఎంఎస్‌ఎంఈలుగా మార్చడానికి మార్గాన్ని సులభతరం చేయనుంది. ప్రస్తుతం దిగుమతుల పైన ఆధారపడుతున్న దేశంలో తెలంగాణను సుస్థిరమైన ఎగుమతిదారుగా నిలిపేందుకు ఈ విధానం ఎంతో దోహదం చేస్తుంది.

రాష్ట్రంలోని యువతకు నాణ్యమైన ఉపాధి, అత్యంత శక్తివంతమైన ఎంఎస్‌ఎంఈ పర్యావరణ వ్యవస్థను సృష్టిం చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎంఎస్‌ఎంఈ పాలసీ ద్వారా అత్యు న్నత స్థాయిలో సమర్థవంతమైన పర్యవేక్షణ తో దేశంలో ఒక బలమైన సంస్థాగత యం త్రాంగాన్ని స్థాపించడంపై దృష్టి సారిస్తుంది. 

పరిశ్రమల కమిషనరేట్‌లో ఎంఎస్‌ఎంఈ విభాగం 

ఎంఎస్‌ఎంఈ పాలసీ అమలు కోసం ప్రభుత్వం పర్యవేక్షణ యంత్రాంగాలను కూడా అభివృద్ధి చేసింది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు ఎల్లప్పుడు సేవలందించేం దుకు పరిశ్రమల కమిషనరేట్‌లో ఎంఎస్‌ఎంఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. దీని కోసం రాష్ట్ర ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నది. ఎంఎస్‌ఎంఈ పాలసీ సంబంధిత రం గం పునరుద్ధరణకు మూలస్తంభంగా నిలువనున్నది. ఆవిష్కరణ, ఉపాధి, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఎంఎస్‌ఎంఈ లు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం ద్వారా వాటి సామర్థ్యం పనిచేసేందుకు వీలు కలుగుతుంది. నిరంతర మద్దతు, వ్యూ హాత్మక కార్యక్రమాలతో ఎంఎస్‌ఎంఈలు ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడట మే కాకుండా మరింత సుస్థిరమైన భవిష్యత్‌కు మార్గం సుగమమం చేయనున్నాయి. 

పాలసీ లక్ష్యాలు.. ప్రభావం..

  1. జీఎస్‌డీఈకి ఎంఎస్‌ఎంఈల సహకారంతో 10 శాతం పెరుగుదల
  2. టీజీ నమోదైన ఎంఎస్‌ఎంఈల సంఖ్యలో ఏటీ 15 % వృద్ధి

ఫలితాలు...

  1. సమగ్ర ఉపాధి కల్పన
  2. సమానమైన ఆర్థిక వృద్ధి
  3. టెక్నాలజీ ఆధునికీకరణ చెందుతుంది
  4. మెరుగైన ఉత్పాదకత ఎదుగుదల సూచికలు...
  5. ఎంఎస్‌ఎంఈలలో 20 శాతం ఉద్యోగాల పెంపు. అందులోనూ 30 శాతం ఎస్సీ, ఎస్టీల, మహిళా కార్మికుల పెరుగుదల
  6. మొత్తం ఎంఎస్‌ఎంఈలలో ప్రస్తుతం 10 శాతం ఉన్న జిల్లాల్లో 20 శాతానికి పెంపు
  7. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్‌కు సగటు మూలధన పెట్టుబడిలో 10 శాతం పెంపు
  8. గ్రాస్ వాల్యూ యాడెడ్ 10 శాతం వాటా ఉన్న 10 శాతం ఎంఎస్‌ఎంఈలను తదుపరి కేటగిరికి ఎదిగేలా చర్యలు