calender_icon.png 5 March, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనియన్ బ్యాంక్‌లో ఎంఎస్‌ఎంఈ మెగా ఔట్‌రీచ్ క్యాంపులు

05-03-2025 01:36:03 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా కేంద్ర కార్యాలయ ఆదేశాల మేర  హైదరాబాద్ జోనల్ కార్యాలయ పరిధిలోని పంజాగుట్ట ప్రాంతీయ కార్యాల  సో మవారం, మంగళవారం ఎంఎస్‌ఎంఈ మె గా ఔట్‌రీచ్ క్యాంపులు నిర్వహిం  అధికారులు తెలిపారు.

ఎంఎస్‌ఎంఈ కేంద్రప్రభుత్వ జేడీ  విజయ్‌కుమార్, మధుకర్ బాబు, ఐడీఏ జీడిమెట్ల అధ్యక్షుడు సాయికిశోర్, యూబీఐ సెంట్రల్ ఆఫీస్ సీజీఎం ఎమ్ రవీంద్రబాబు, హైదరాబాద్ జోనల్ ఆఫీస్ సీజీఎంలు కే భాస్కరరావు, అజయ్‌కుమార్, డీజీఎం యూవీ రజనీకాంతరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ..

వికసిత్ భారత్ సాధనలో భాగంగా ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లను స్థాపించేందుకు మెరుగైన ఉత్పత్తిని సాధించేందుకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మెగా ఔట్‌రీచ్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పంజాగుట్ట ప్రాంతీయ కార్యాలయ పరిధిలోని బాలానగర్, జీడిమెట్లలో నిర్వహించా మన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపీ, ముద్ర, స్టాండప్ ఇండియా పథకాల కింద తక్షణ రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పంజాగుట్ట డిప్యూటీ రీజనల్ హెడ్ టీవీ బాలకృష్ణ, ఎంఎస్‌ఎంఈ పాయింట్ ఏజీఎం పైడి రాజా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.