30-04-2025 12:00:00 AM
యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ), కరెంట్ సేవింగ్, సేవింగ్ ఎకౌంట్ (సీఏఎస్‌ఏ) అవుట్‌రీచ్ క్యాంపును ఘనంగా నిర్వహించారు. అనేక మంది ఔత్సాహిక పారిశ్రా మికవేత్తలు హాజరయ్యారు.
హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జోన్ హెడ్ శర్వేష్ రంజన్, జియెఐఏ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పుండుగుట్టా రీజియన్ రీజనల్ హెడ్ రజని కాంతరావు అతిథులుగా హాజరయ్యారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు భారత ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయనే విషయంపై భాగస్తులకు అవగాహన కల్పించారు.
ఆయా సంస్థల ఔత్సాహికులకు యూనియన్ బ్యాంక్ వారు రూపొందించిన విస్తృత బ్యాంకింగ్ అవకాశాలు, రుణసౌకర్యాలు, సీఏఎస్‌ఏ ఉత్పత్తుల గురించి పూర్తిగా అవగాహన కల్పించారు. కొంతమంది ఖాతాదారులకు బ్యాంకు మంజూరు చేసిన రుణ నిధుల ప్రాథమిక అనుమతులు, అనుమతి లేఖలను అందజేశారు.
ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నదని బ్యాంకు అధికారులు తెలిపారు. పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తామని చెప్పారు.