calender_icon.png 6 March, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ శిబిరం

06-03-2025 12:26:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 5 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ఉపాధి కల్పన తోపాటు ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రో త్సహించేందుకు సైఫాబాద్‌లోని యూనియ న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ము చ్చింతల్‌లోని స్వర్ణభారత్ క్యాంపస్‌లో యూ నియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో బుధవారం మెగా ఎంఎస్‌ఎంఈ శిబిరం నిర్వహించింది. 

50 మందికిపైగా లబ్ధిదారులకు రూ.100 కోట్ల విలువైన మంజూరు లేఖలను అందజేశారు. ముఖ్య అతిథి, ముంబైలోని ఎంఎస్ ఎంఈ వర్టికల్ జనరల్ మేనేజర్ జీకే సుధాకర్రావు, యూనియన్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీ స్ జనరల్ మేనేజర్ ఆర్‌ఎల్ పట్నాయక్ దేశాన్ని స్వావలంబన చేసే ఎంఎస్‌ఎంఈల ఆవశ్యకతను  వివరించారు.

హైదరాబాద్ జోనల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు యూనియన్ బ్యాంక్  చొరవను వివరించారు. రంగారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం మందడి శ్రీలక్ష్మి, బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ సోనాలిక, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు రవి మారేం, జగదీశ్ లేపాక్షి 400మందికి అవగాహన కల్పించారు.