calender_icon.png 1 November, 2024 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైక్రోసాఫ్ట్ విండోస్ ఢమాల్!

20-07-2024 12:05:00 AM

  1. ఎంఎస్ విండోస్ (టె)ఎర్రర్

  2. ప్రపంచవ్యాప్తంగా కల్లోలం

వ్యాపారాలపై తీవ్ర ప్రభావం

నిలిచిపోయిన వందల విమానాలు

బ్యాంకులు, వాణిజ్య సేవలకు అంతరాయం

చేతి రాతతో బోర్డింగ్ పాసులిచ్చిన సిబ్బంది

ఎట్టకేలకు సమస్య పరిష్కరించిన మైక్రోసాఫ్ట్

సెక్యూరిటీ అప్‌డేట్ బెడిసి మూగబోయిన కంప్యూటర్లు

మైక్రోసాఫ్ట్‌పై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం

  • వ్యాపారాలపై తీవ్ర ప్రభావం

నిలిచిపోయిన వందల విమానాలు

శంషాబాద్‌లో నిలిచిన 35 విమానాలు

బ్యాంకులు, వాణిజ్య సేవలకు అంతరాయం.. గగ్గోలు పెట్టిన వ్యాపారులు

సెక్యూరిటీ అప్‌డేట్ బెడిసి మూగబోయిన కంప్యూటర్లు

మైక్రోసాఫ్ట్ విండోలో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచాన్ని కొన్ని గంటల పాటు కుదిపేసింది. శుక్రవారం ఒక్కసారిగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఆగిపోవటంతో పలు దేశాల్లో అనేక సేవలు స్తంభించాయి. విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కంపెనీ ఇచ్చిన సెక్యూరిటీ అప్‌డేట్‌లో ఎర్రర్ ఏర్పడటంతో కంప్యూటర్లలో బ్లూస్క్రీన్ డెత్ మాత్రమే కనిపించింది. కంప్యూటర్లు వాటంతట అవే షట్‌డౌన్ అయ్యి, రీబూట్ అయ్యాయి. దీంతో అనేక రంగాల్లో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రధానంగా విమానయానం, బ్యాంకింగ్, స్టాక్‌మార్కెట్, రిటైల్ షాపింగ్‌మాల్స్, మీడియా ప్రసారాలు తదితర సేవలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. విమానాల టికెట్ బుకింగ్, చెకిన్ సేవలు ఆగిపోవటంతో చాలా విమానాలు గాల్లోకి ఎగరలేదు. శంషాబాద్ విమానాశ్రయంలో 35 విమానాలు నిలిచిపోయాయి. ఇండిగో సంస్థ ౨౦౦ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. అమెరికా, యూరప్‌లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నది. ఇది కేవలం సాంకేతిక లోపమేనని మైక్రోసాఫ్ట్  పేర్కొన్నది. బగ్ ఉన్న సెక్యూరిటీ అప్‌డేట్‌ను వెనక్కు తీసుకోవటంతో సమస్య పరిష్కారమైంది. అన్ని సేవలకు ఒకే సంస్థపై ఆధారపడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని నెటిజన్లు మండిపడ్డారు. మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా ఇద్దరు సైనికులు దున్నపోతుపై స్వారీ చేస్తున్న ఫొటోను ట్వీట్ చేసి మైక్రోసాఫ్ట్‌పై సెటైర్ వేశారు.  

  1. 200 కంటే ఎక్కువ ఇండిగో విమానాలు రద్దు.. 
  2. విమానాల షెడ్యూల్ చూసుకోవాలని విమాన ప్రయాణికులను కోరిన విమానయాన సంస్థలు
  3. హైదరాబాద్ విమానాశ్రయంలో కూడా పలు విమానాలు రద్దు
  4. ‘సాఫ్ట్’ గా కిల్ చేసిన మైక్రోసాఫ్ట్ 

న్యూఢిల్లీ, జూలై 19: సాంకేతిక సమస్య కారణంగా శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న కోట్లాది యూజ ర్లకు బ్లూస్క్రీన్ డెత్ విండో దర్శనమిచ్చింది. క్లౌడ్ సర్వీసులతో నడిచే లాప్‌టాప్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి సిస్టమ్ షట్‌డౌన్ లేదా రీస్టార్ట్ అయింది. భారత్, అమెరికా, అస్ట్రేలియా సహా పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

ఫలితంగా వ్యక్తిగత సేవలతో పాటు ప్రభుత్వ, బ్యాంకింగ్, విమానయాన రంగ సేవలకు అంతరాయం ఏర్ప డింది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా తమ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. విండోస్ వైఫల్యం కారణంగా ముఖ్యంగా విమానయాన సేవలకు అంతరాయం కలిగింది. విమానయాన సేవలు ఆలస్యం కావడం లేదా క్యాన్సిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫ్రంటియర్ ఎయిర్‌లైన్స్ కొన్ని విమాన సేవలను రద్దు చేయా ల్సి వచ్చింది. భారత్‌లోనూ ఎయిర్‌లైన్స్ సేవలకు అంతరాయం కలిగింది. ఇందుకు ప్రధా న కారణం విండోస్ పనిచేయకపోవడం వల్ల బుకింగ్, చెక్ ఇన్ సేవలు నిలిచిపోవడమే. 

సమస్యను పరిష్కరించాం

విండోస్ వైఫల్యంపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, ఇతర సర్వీసుల్లో సమస్యలు తలెత్తాయని వివరించింది. ఈ అంతరాయాన్ని పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. బ్లూస్క్రీన్ ఎర్రర్‌కు కారణమైన క్రౌడ్ స్ట్రయిక్ అప్‌డేట్‌ను వెనక్కు తీసుకున్నట్లు వెల్లడించింది. దీనికి డీబగ్ రూపొందించామని, ప్రస్తుతం సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు స్పష్టం చేసింది. అయితే, మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, కొన్ని సర్వీసుల్లో సమస్యలు ఉన్నట్లు తెలిపింది. ఈ సమస్యపై సైబర్ సెక్యురిటీ సంస్థ క్రౌడ్ స్ట్రయి క్ సీఈవో జార్జ్ కుక్ కూడా స్పందించారు. సింగిల్ కంటెంట్ అప్‌డేట్‌లో బగ్ తలెత్తిన క స్టమర్లతో తమ కంపెనీ సంప్రదింపులు జరుపుతోందన్నారు. మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై ఎలాంటి ప్రభావం పడలేదని పే ర్కొన్నారు. ఇది సైబర్ దాడి లేదా భద్రతా వైఫల్యం కాదని వివరించారు. సమస్యను గు ర్తించి డీబగ్ చేశామని, క్రౌడ్ స్ట్రయిక్ వినియోగదారుల భద్రతకు తాము పూర్తి ప్రాధా న్యమిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. 

ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం: అశ్వినీ వైష్ణవ్

విండోస్ సేవలకు అంతరాయం తలెత్తడంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. సాంకేతిక సమస్య నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. సమస్యకు కారణాలు గుర్తించామని, వీటి పరిష్కారానికి అప్‌డేట్లు విడుదలయ్యాయని ప్రకటించారు. కీలకమైన నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)పై ఎలాంటి ప్రభావం పడలేదని, ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ) సాంకేతిక సలహాలను జారీ చేస్తుందని తెలిపారు. విండోస్ భద్రతా సంస్థ క్రౌడ్ స్ట్రయిక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సర్ తాజాగా తీసుకొచ్చిన అప్‌డేట్ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని సీఈఆర్‌టీ వివరించింది. వాళ్లు చేసిన మార్పులను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. 

దున్నపోతులపై స్వారీ చేసినట్లు..

మైక్రోసాఫ్ట్ వైఫల్యంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలా మంది నెటిజన్లు, యూజర్లు సోషల్ మీడియాలో అ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రయిక్ వైఫల్యంపైఆనంద్ మహీంద్రా ఎగతా ళి చేస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇద్దరు సైనికులు దున్నపోతులపై స్వారీ చేస్తున్న ఫొటో ను షేర్ చేస్తూ ఓ వ్యవస్థపైనే అందరూ ఆధారపడితే పరిస్థితి ఇలా ఉంటుందని పేర్కొ న్నారు. డిజిటల్ కరెన్సీలు, కంప్యూటర్లపై ఎంత ఆధారపడి ఉన్నామో ఈ చిత్రం చూపిస్తున్నదని పేర్కొన్నారు. ఇంటర్నెట్, కంప్యూ టర్లు, ఏఐ వ్యవస్థలు స్తంభిస్తే ప్రపంచం ఆగిపోయినట్లేనని అసహనం వ్యక్తం చేశారు. మ రో నెటిజెన్ స్పందిస్తూ ఈ రోజు పరిస్థితి మనం కొన్ని కంపెనీలపై ఎక్కువగా ఆధారపడడాన్ని హైలైట్ చేస్తోందని తెలిపాడు. అందు కే ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకోవడ ం ఎంతో అవసరమని వివరించాడు. మరొకరు టెక్నాలజీకి కూడా బ్రేకింగ్ పాయింట్ ఉ ంటుందని, ఇది  రిమైండర్ అని జోడించాడు. 

మైక్రోసాఫ్ట్‌ది నాసిరకం సరుకు 

గతంలో యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సైతం మైక్రోసాఫ్ట్‌పై తీవ్రంగా స్పందించారు. మైక్రోసాఫ్ట్ వైఫల్యం నేపథ్యంలో స్టీవ్ జాబ్స్ కొన్నేళ్ల కింద మాట్లాడిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఒక మూడో తరగతి ఉత్పత్తి అంటూ జాబ్స్ ఎద్దేవా చేశారు. మైక్రోసాఫ్ట్‌కు ఎలాంటి అభిరుచి లేదని, కొత్త మార్గాలను వాళ్లు ఎప్పుడూ అన్వేషించరని ఆరోపించారు. 

అనేక సేవలకు అంతరాయం

విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అనేక రంగాల సేవల్లో అంతరాయం ఏర్పడింది. విమాన సర్వీసులతో పాటు బ్యాంకింగ్, వార్తా సంస్థల ప్రసారాలు, సూపర్ మార్కెట్ సేవలు, పోలీసులు వ్యవస్థలు, స్టాక్ ఎక్సేంజీల్లో సమస్యలు తలెత్తాయి. ఈ పరిస్థితి వల్ల చాలా గంటలపాటు అనేక సేవలు నిలిచిపోయాయి. 

* భారత్‌లో అనేక డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థల్లో చెక్‌ఇన్, బుకింగ్ సహా విమాన సర్వీసుల వివరాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఆకాశ, ఎయిరిండియా తదితర విమానయాన సంస్థలు భారత్‌లో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. దీంతో ఇండిగో లాంటి కొన్ని సంస్థలు బోర్డింగ్ పాసులను మ్యానువల్(చేతితో రాసి)గా ఇవ్వాల్సి వచ్చింది. పలువురు ప్రయాణీకులు ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారత్‌లోనూ వ్యాపారులు తమ కార్యకలాపాలకు అంతరాయం ఎదురైందని తెలిపారు. చెల్లింపు వ్యవస్థలు సైతం కొంతసేపు స్తంభించాయి.

* ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ మీడియా ప్రసారాల్లోనూ అంతరాయం ఏర్పడింది. బ్రిటీష్ న్యూస్ చానెల్ స్కైన్యూస్ సైతం వార్తల ప్రసారంలో అవాంతరాలు ఎదుర్కొంది. తాము ప్రసారం చేయలేమని ప్రకటింటిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ అసోసియేటేడ్ ప్రెస్ కూడా వార్తల పంపిణీలో అంతరాయాన్ని ఎదుర్కొంది. 

* పూల్‌వర్త్స్ అనే సూపర్‌మార్కెట్ సేవల్లోనూ అంతరాయం తలెత్తింది. షాపులు, సూపర్‌మార్కెట్లలో బ్యాంకు కార్డుల స్వైపింగ్ కూడా పనిచేయలేదు. 

* కొన్ని దేశాల్లో ఆన్‌లైన్‌తో అనుసంధానమైన పోలీసులు వ్యవస్థలు సైతం పనిచేయలేదు.

* లండన్ స్టాక్ ఎక్సేంజీలోనూ సమస్యలు తలెత్తాయి. నువామా, ఎడెల్‌వీస్, మోతీలాల్ ఒస్వాల్ సహా అనేక బ్రోకరేజీ సంస్థలు సాంకేతిక అవాంతరాలను ఎదుర్కొన్నాయి. లండన్‌లో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. 

* విండోస్ సమస్య కారణంగా పారిస్ ఒలింపిక్స్ ఐటీ కార్యకలాపాలకూ అంతరాయం కలిగింది. ఈ క్రీడలు వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణ కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను స్వీకరించినట్లు ఆర్గనైజింగ్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 

* అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అగ్రరాజ్యంలో ఎంతో కీలకంగా భావించే ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్ 911 సేవలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.  

శంషాబాద్‌లో నిలిచిన 35 విమానాలు 

రాజేంద్రనగర్, జూలై 19: మైక్రోసాఫ్ట్ బ్లూస్క్రీన్ ఎర్రర్ కారణంగా అంతర్జాతీయంగా ఏవియేషన్ సిగ్నల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో శంషాబాద్‌లో పలు విమానాలు నిలిచిపోయాయి. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యం నుంచి శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు ఏవియేషన్ సిగ్నల్స్ రాకపోవడంతో ఆగిపోయాయి. 35 విమానాలు ఆగిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఇక్కట్లపాలయ్యారు. అనంతరం సమస్య పరిష్కారం అయినట్లు సమాచారం.