- ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, పోలీసులకు మధ్య తోపులాట
- హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలింపు
- హుజూరాబాద్‌లో ఉద్రిక్తత
- హుజూరాబాద్, నవంబరు 9: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని తన ఇంటి వద్ద శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఏర్పాటు చేసిన రెండో విడత దళితబంధుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు పెద్ద ఎత్తున దళితులు తరలివచ్చారు. కొందరు ఎమ్మెల్యేను అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి విగ్రహానికి పూలమాలవేసి ధర్నా చేయాలని కోరారు. ఈ మేరకు దళితులందరితో కలిసి చౌరస్తా వైపు కదిలారు.
- కౌశిక్‌రెడ్డిని పోలీసులు నిలువరించాలని చూసినా వినకుండా వేల మందితో అంబేద్కర్ చౌరాస్తాకు కదిలారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం డప్పు కొడుతూ ధర్నాకు దిగారు. దీంతో కౌశిక్‌రెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు.
- ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డికి పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎమ్మెల్యేను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు.
ఆస్కార్ స్థాయి నటన: ప్రణవ్
దళితులను అడ్డుపెట్టుకొని కౌశిక్‌రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని, ఆస్కార్ స్థాయి రాజకీయ నటుడని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ అన్నారు. దరఖాస్తు స్వీకరణ పేరుతో పక్కా పతకం ప్రకారం డ్రామా ఆడాడని విమర్శించారు. రెండవ విడత దళితబంధు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఈ విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు.