21-03-2025 12:00:00 AM
ఒక్క సినిమా చాలు.. ఫే ట్ మార్చడానికి.. అలాంటి ఒక్క సిని మా కోసం మృణాల్ ఠాకూర్ చాలా కా లం పాటు వేచి చూసింది. మొత్తానికి అమ్మ డికి ఆ తరుణం ‘సీతారామం’ చిత్రంతో వచ్చిం ది. అంతే అమ్మడి ఫేట్ మారిపోయింది. ఈ సినిమా మృణాల్ కెరీర్‌ను అమాంతం పైకి లేపింది. అంతకు ముందు ఎన్నో బాలీవుడ్ చిత్రాలు, సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క తెలుగు సినిమాలతో వచ్చేసింది. ఆ తరువాత చేసిన ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ అమ్మడికి మంచి పేరు వచ్చింది.
అంత మంచి మార్కెట్‌ను అందించిన సౌత్‌పై ఈ ముద్దుగమ్మ ప్రస్తుతం శీతకన్ను వేసింది. బాలీవుడ్ చి త్రాలపై ఫోకస్ పెట్టింది. అంతేకాదు.. వరుస సినిమాలను లైన్‌లో పెట్టేసింది. ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంట ర్‌టైనర్‌తో పాటు ‘సన్నాఫ్ సర్దార్ 2’ చేస్తోంది. అడవి శేష్‌తో ‘డెకాయిట్’ చిత్రం ఒక్క టే టాలీవుడ్‌లో చేస్తోంది. వాస్తవానికి సౌత్ డైరెక్టర్స్ చాలా మంది ఆమెకు అవకాశం ఇస్తామంటూ సంప్ర దిస్తున్నారట. కానీ ఈ ముద్దు గుమ్మ ససేమిరా అంటోం దని టాక్.