17-03-2025 04:30:15 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు రామగిరి మహేష్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మాట ఇచ్చి దాటవేశాడని ఆరోపించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏ బి సి కాకుండా సంపూర్ణ ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నారు. మంత్రివర్గంలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం శాస్త్రీయమైన వర్గీకరణకు నడుంబిగించాలని కోరారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు చెన్నూరు సమ్మయ్య మాదిగ, జిలకర శంకర మాదిగ, మచ్చ రాజేష్ మాదిగ, నా తర శివ, పుల్లూరి రాము బొడ్డు రవీందర్, బొంకూరి రామచంద, ఆయిళ్ల రామకృష్ణ, పద్మక్క, రాయలింగు, అడ్డూరి వెంకట్, అరుణ్, మిట్టపల్లి మల్లేష్, రామగిరి భూమయ్య, రామగిరి వెంకటి లు పాల్గొన్నారు.