20-03-2025 04:29:50 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల బుధవారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. బెల్లంపల్లి పాత బస్టాండ్ నుండి మొదలుకొని అంబేద్కర్ చౌరస్తా వరకు ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ అంబేద్కర్ చౌరస్తాలో టపాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ మాదిగ మాట్లాడుతూ.. గడచిన 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఎన్నో అవమానాలను, ఎన్నో ఒడిదుడుకలను అనుభవించామన్నారు.
అంతేకాకుండా రాజకీయ పార్టీలు పదవుల ఆశ చూపించిన వాటికి లొంగకుండా మనకోసం, మన జాతి కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య మాదిగ, మండల ఇంచార్జి జిలకర శంకర్ మాదిగ,మచ్చ రాజేష్ మాదిగ, నాతరి శివ మాదిగ పుల్లూరి రాము మాదిగ ,కాంపల్లి శంకర్ మాదిగ, ఎల్లయ్య మాదిగ, చిన్న రాజం మాదిగ, రత్నం ఐలయ్య మాదిగ, బొంకూరి రామచంద్ర మాదిగ, మిట్టపల్లి మల్లయ్య , వెంకన్న మాదిగ , కేశవ్ మాదిగ, తామ బుజ్జి అక్క తదితరులు పాల్గొన్నారు.