మణుగూరు (విజయక్రాంతి): ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ చిత్రపటానికి ఆదివారం మణుగూరు పట్టణంలో పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మందకృష్ణకు పద్మశ్రీ అవార్డును ప్రకటించడం హర్షనీయమని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మందకృష్ణకు పద్మశ్రీ అవార్డును ప్రకటించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపి ఆయన చిత్రపటానికి కూడా పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గంగపురి మోహన్రావు, కృష్ణ, వెంకన్న, నాగరాజు, సాయికుమార్, సతీష్, గౌతమి, తిరపమా, వెంకట మహాలక్ష్మి, కలమ్మ, నాగేంద్ర, పద్మ, కనకన్న, చెక్క రమేష్, కొమ్ము హుస్సేన్, మీనా కుమార్ తదితరులు పాల్గొన్నారు.